No title


 *సమతుల జీవన శైలితో ఆరోగ్య సంరక్షణ* 


 *ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్* 


క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్య కరమైన ఆహారంతో గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందగలుగుతామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ మాట్లాడుతూ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా “వరల్డ్‌ హార్ట్ డే” ని పాటిస్తున్న తరుణంలో హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను అధికమించే క్రమంలో ఆరోగ్య నియమాలను పాటించాలన్నారు. శరీర తత్వాన్ని అనుసరించి వైద్యులు సూచించిన విధంగా నిత్యం శారీరక వ్యాయామం చేయటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటానికి ప్రయత్నించాలని గౌరవ హరిచందన్ వివరించారు. హృదయ సంబంధ వ్యాధుల ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యాలతో అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్నాయని, ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్దితిని అధికమించ గలుగుతామని గవర్నర్ పేర్కొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.