కరోనావైరస్ మరింత విస్తరించకుండా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించింది.
పది, ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించింది.
మార్చి 31 వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేయనున్నారు.
అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Thank You