No title


 *ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్* 


భారత ప్రధాని మాననీయ నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని 71వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన నేపధ్యంలో గవర్నర్ మాట్లాడుతూ భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభవేళ, మోదీ సమర్ధ నాయకత్వంతో కీలక రంగాలలో అభివృద్ధి పతాక స్దాయికి చేరుకుందన్నారు. చైతన్యవంతమైన నాయకత్వం అందిస్తున్న నరేంద్ర మోదీ వల్లే ఇది సాధ్యపడుతుందన్నారు. అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ మెరుగుపడిందంటే అది ప్రధాని పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ దీర్ఘాయుష్షును పొంది, మంచి ఆరోగ్యం, ఆనందంతో ఫలవంతమైన జీవితాన్ని పొందాలని తాను కోరుకుంటున్నానన్నారు. నరేంద్ర మోదీ తన నిర్ణయాత్మక పాత్రతో భరతజాతిని మరింత ఉన్నత స్ధితికి తీసుకెళ్లాలని పూరి జగన్నాథ స్వామి, తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని ప్రార్థిస్తున్నానని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రధానికి సందేశం పంపారు. ఈ క్రమంలో శుక్రవారం రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.