*అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్. పిల్లలపైనా ప్రభావం కేంద్ర హోంశాఖ హెచ్చరిక* ???
అక్టోబర్‌లో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపైనా ప్రభావం చూపనుందని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసినట్లు తెలిసింది.
దేశంలో పీడియాట్రిక్ (చిన్న పిల్లల వైద్యం) వసతులను భారీగా పెంచాల్సిన అవసరం ఉన్నదని ‘చిల్డ్రన్ వల్నరబిలిటీ అండ్ రికవరీ’ పేరుతో పీఎంవోకు సమర్పించిన రిపోర్టులో నిపుణులు చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సదుపాయాలు అవసరానికి సరిపోయే పరిస్థితి లేదని ఈ కమిటీ అభిప్రాయపడింది.
దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు, దివ్యాంగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కమిటీ చెప్పింది. ఇప్పటికే 12 ఏళ్లు నిండిన చిన్నారుల కోసం జైకొవ్-డీ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చినా.. ఈ డ్రైవ్ ఇంకా ప్రారంభం కాలేదని కేంద్రానికి గుర్తు చేసింది.
హోంశాఖ ఆధ్వర్యంలో పని చేసే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కరోనా థర్డ్ వేవ్‌కు సంబంధించి కీలక అంచనాలు, సూచనలు చేసింది.


Thank You