రాజ్ భవన్
విజయవాడ
*బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్*
టోక్వో ఒలింపిక్స్ జావిలిన్ త్రో విభాగంలో 87.58 మీటర్లు విసిరి స్వర్ణపతకం సాధించిన నీరజ్ చోప్రాను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ అభినందించారు. 135 కోట్ల మంది భారతీయులు ప్రపంచ యవనికపై తలెత్తుకొనేటట్లు చేశారని అభినందించారు. ప్రపంచ ఒలింపిక్స్ అద్లెట్స్ లో భారత్ కు ఇది తొలిస్వర్ణం కాగా నీరజ్ చోప్రా మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.


Thank You