No title


 తిరుప‌తి, 2021 ఆగ‌స్టు 22


శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఐనా మ‌హ‌ల్ ప్రారంభం


తిరుప‌తి శ్రీగోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో రూ. 66 లక్షలతో ఆధునీక‌రించిన ఐనా మ‌హ‌ల్‌ను ఆదివారం రాత్రి టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రారంభించారు.


   శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఐనా మహల్ లో సాయంత్రం 6.30 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, పుండరీక వల్లి అమ్మవారి ఉత్స‌వ‌ర్ల‌కు ఊంజ‌ల్ సేవ నిర్వ‌హించారు. ఐనా మహల్ ను విద్యుత్ దీపాలతో అలంకరించారు.


       ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, 

ఎఫ్ఏసిఎ వో శ్రీ బాలాజి, ఎస్ఈ ఎలక్ట్రికల్

 శ్రీ వెంకటేశ్వర్లు, ఆల‌య ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో 

శ్రీ రాజేంద్రుడు, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజులు,

 శ్రీ రమణ ప్రసాద్, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.శ్రీ‌నివాస దీక్షితులు, ఏఈవో

 శ్రీ ర‌వికుమార్ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కామ‌రాజు పాల్గొన్నారు.


  ఐనా మహల్ లో ఇక రోజూ ఊంజల్ సేవ : ఈవో 

       గోవింద రాజాస్వామి ఆలయంలో ఆధునీకరించిన ఐనా మహల్ ను శ్రావణ పౌర్ణమి పుణ్యదినం సందర్భంగా పునఃప్రారంభించామని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, 20 ఏళ్ళ కిందట నిర్మించిన ఐనా మహల్ ను ఆధునీకరించి పునః ప్రారంభించామన్నారు. ఇక మీదట ఇక్కడ రోజూ స్వామివారి ఊంజల్ సేవ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.