04.08.2021
*అమరావతి*
*జగనన్న పచ్చ తోరణం – వన మహోత్సవం 2021*
*నేడు (05.08.2021, గురువారం) ఎయిమ్స్ మంగళగిరి ఆవరణలో మొక్కనాటి ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్ జగన్*
*వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే బృహత్తర లక్ష్యంతో శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం*
*గత రెండు సంవత్సరాలలో 33.23 కోట్ల మొక్కలు నాటాం, ఈ సారి కూడా అదే ఉత్సాహంతో విరివిగా మొక్కలు నాటుదాం – బాలినేని శ్రీనివాసరెడ్డి – అడవులు, పర్యావరణ శాఖా మంత్రి*
*వన మహోత్సవం 2021*
- ఆకుపచ్చని ఆంధ్రావని మన లక్ష్యం, ప్రతీ ఒక్కరం మొక్కలు నాటుదాం, పచ్చని పుడమిని భావితరాలకు అందిద్దాం – బాలినేని శ్రీనివాసరెడ్డి
- విరివిగా మొక్కలు నాటుదాం, వాటి సంరక్షణను బాధ్యతగా స్వీకరిద్దాం
- నరేగా కింద దాదాపు 75 లక్షల మొక్కలు నాటుతున్నాం
- నాడు–నేడు పథకంలో భాగంగా స్కూళ్ళు, ఆసుపత్రులలో మొక్కలు నాటుతున్నాం – బాలినేని శ్రీనివాసరెడ్డి
- సామాజిక వనాల అభివృద్ది, అడవుల పునరుద్దరణ కార్యక్రమం
- జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందించడం, తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని సాధించడానికి శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- అడవుల సంరక్షణ, పచ్చదనం పెంపొందించడం శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం అతి ముఖ్య ప్రాధాన్యత – బాలినేని శ్రీనివాసరెడ్డి


Thank You