*ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణం పనులు పూర్తి చేయండి*
*నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే ఉపేక్షించేది లేదు*
*గురుకులం కార్యదర్శి శ్రీకాంత్ ప్రభాకర్*
కురుపాం, ఆగష్టు 17 :- కురుపాంలో 12 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను గురుకులం కార్యదర్శి శ్రీకాంత్ ప్రభాకర్, ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి నాటికి చేపట్టిన పనుల పై ముందుగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల నుండి ఆరా తీశారు, అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ త్వరితగతిన భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆ విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అలాగే పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.
ఈ పర్యటనలో. ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ శాంతిస్వరరావు, డి.ఇ తిరుపతి నాయుడు, ఏ. ఇ చాణక్య రావు, కాంట్రాక్టర్లు ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Thank You