అమరావతి :
*ఏపీలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ.!*
ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
శ్రీశైలం దేవాలయం ఈవోగా లవన్నను నియమించారు.
ప్రస్తుత ఈవో కేఎస్ రామారావును సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీవోగా ఎ.మురళి బదిలీ అయ్యారు.
అమలాపురం ఆర్డీవోగా వసంతరాయుడు నియమితులయ్యారు.
ఏపీఎస్సీ సీఎఫ్‌సీ కృష్ణా జిల్లా ఈడీగా చంద్రలీలను నియమించారు.
గురజాల ఆర్డీవోగా పార్ధసారధిని ప్రభుత్వం నియమించింది.
పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ పీఏగా వసంతబాబును బదిలీ చేశారు.
కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా యు.రంగస్వామిని నియమించారు.
విశాఖ జాయింట్ కలెక్టర్ (ఆసరా) గోవిందరావు నర్సీపట్నం ఆర్డీవోగా బదిలీ అయ్యారు.
రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ఓఎస్డీగా నర్సింహులును బదిలీ చేశారు.
శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా హెచ్.వి. జయరాంను నియమించారు.
Thank You