మైనారిటీల అభివృద్దికి విశేష కృషి

 


మైనారిటీల అభివృద్దికి విశేష కృషి

ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తానని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అన్నారు. ఇటీవలి వరకు అనంతపురం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన గంధం చంద్రుడు ప్రభుత్వ పరిపాలనాపరమైన బదిలీలలో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు. బుధవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టి ఆశాఖ ఉన్నతాధికారులతో ప్రాధమికంగా సమావేశం అయ్యారు. శాఖకు సంబంధించిన విభిన్న అంశాలను అధికారులు ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విశేష ప్రాధన్యత ఇస్తూ వారి ఆర్ధిక స్వావలంబనకు బాటలు వేస్తున్నారని ఆ క్రమంలో అధికారులు మెరుగైన పనితీరును ప్రదర్శించాలని అదేశించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.