Andhra Pradesh: వారికి గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. వచ్చే నెలలోనే ఖాతాల్లోకి డబ్బులు.ఏపీలోని సీఎం జగన్ సర్కార్ అగ్రిగోల్డ్ బాధితులు, నేతన్న నేస్తం, విద్యాకానుక లబ్ధిదారులకు శభవార్త చెప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి.

 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రూ. 20 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న చెల్లింపులు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న నుంచి డబ్బులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఆగస్టు 10 వ తేదీన నేతన్న నేస్తం, ఆగస్టు 16న విద్యాకానుక అందించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇంకా ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్స్ కు ఆగస్టు 27న ప్రోత్సహకాలు అందిస్తామని తెలిపారు.ఇందుకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. ఏపీలోని ఉన్నతాధికారులు, కిందిస్థాయి సిబ్బంది పనితీరుపై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదనే విషయం తన దృష్టికి రావడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారికి మెమోలు జారీ చేయాలని అన్నారు. అంతేకాదు వారికి మెమోలు ఇవ్వడం అనేది తనకు ఎంతో బాధ కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఒకరకంగా ఇది తన పనితీరుకు తాను మెమో ఇచ్చుకున్నట్టు అని సీఎం జగన్ అన్నారు. స్పందన కార్యక్రమం సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ ఈ రకంగా కామెంట్ చేశారు.

గత వారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో అప్పటి ఆదేశాలకు అనుగుణంగా ఎంతమంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించారని ఆరా తీశారు. కొందరు జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ల క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదనే విషయం సీఎం జగన్ దృష్టికి వచ్చింది.

వీరితో పాటు పలువురు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే సిబ్బంది హాజరుకావడం లేదని తెలియడంపై ఏపీ ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. వచ్చే స్పందన కార్యక్రమం నాటికి అధికారులు, సిబ్బంది అంతా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి తమ పొరపాటును సరిదిద్దుకోవాలని వ్యాఖ్యానించారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.