No title


 విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ మూసివేత


విశాఖ: సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన తాత్కాలిక నియామక విధానం ‘అగ్నిపథ్‌’పై నిరసనలు మరిన్ని రాష్ట్రాలకు విస్తరించిన నేపథ్యంలో విశాఖపట్నం రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్‌ను మూసివేశారు. మధ్యాహ్నం 12గంటల వరకు స్టేషన్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. రైల్వేస్టేషన్‌లోకి ఎవ్వరికీ అనుమతి లేదని చెప్పారు. కాగా, మరోవైపు విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ దువ్వాడ వద్ద, హౌరా నుంచి వచ్చే రైళ్లన్నీ కొత్తవలస వద్ద నిలిపివేసి, దారి మళ్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.