*ఇఎపి సెట్-2022 నోటిపికేషన్‌ను విడుదల*
*అనంతపురం : అనంతపురం జెఎన్‌టియు ఉన్నత విద్యా మండలి సంయుక్త అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ, కామన్ టెస్ట్-2022 జులై 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఎపి ఇఎపి సెట్ చైర్మన్, అనంతపురం జెఎన్‌టియు ఉపకులపతి ఆచార్య రంగజనార్ధ పేర్కొన్నారు. వర్సిటీలోని ఉపకులపతి కాన్పరెన్స్ హాల్‌లో సోమవారం ఎపి ఇఎపి సెట్-2022 నోటిపికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎపి ఇఎపి సెట్ నోటిపికేషన్‌ను విడుదల చేశామని, మే 10వ తేది వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. రూ.500ల ఆలస్య రుసుముతో జూన్ 20 వరకు, రూ.1000ల రుసుముతో జులై 1వ తేదీ వరకు, రూ.10000ల రుసుముతో జులై 3 వరకు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. జూన్ 23 నుండి 26 వరకు దరఖాస్తులో డేటా కరెక్షన్ చేసుకోవచ్చునని చెప్పారు. జూన్ 27 నుండి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను జులై 4 నుండి జులై 8 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష జులై 11, 12 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.*
Thank You