గవర్నర్ కు విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వానం
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంకు విచ్చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ కు పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆహ్వానం పలికారు. మంగళవారం విజయవాడ రాజ్ భవన్ కు వచ్చిన సరస్వతీ స్వామి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడు నుండి పదకొండు వరకు నిర్వహించే పీఠం వార్షిక మహోత్సవానికి హాజరు కావాలని గవర్నర్ కు ఆహ్వాన పత్రికను అందచేసారు. శ్రీ శారదాపీఠం ఆదిశంకరాచార్య సాంప్రదాయ అద్వైత పీఠంగా విలసిల్లుతుందని, సనాతన ధర్మాన్ని ఆధునిక కాలానికి పునర్నిర్వర్తించే మహత్తర కార్యం చేపడుతుందని ఈ సందర్భంగా పీఠం ఉత్తరాధికారి గవర్నర్ కు వివరించారు. భారతీయ తత్వాన్ని, భారతీయ సత్వాన్ని నేల నలుచెరగులా ప్రబోధం చేసే గొప్ప కార్యాన్ని పీఠం నిర్వహిస్తోందని, వార్షిక మహోత్సవ వేడుకకు సకుటుంబ సమేతంగా విచ్చేసి రాజ శ్యామల అమ్మవారి అనుగ్రహం పొందాలని స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి గౌరవ గవర్నర్ హరిచందన్ కు సాదర పూర్వక ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసొడియా తదితరులు పాల్గొన్నారు.
Thank You