No title


 *అమరావతి.*


*స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం.*


*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం.*


*రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశం*

ఏపీలో పర్యాటకరంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్న ప్రాజెక్టులు

ఒక్కో ప్రాజెక్టుపై కనీసంగా రూ.250 కోట్ల పెట్టుబడులు

వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్ల పెట్టుబడులు

దాదాపు 48 వేల మందికి ఉద్యోగాలు

ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా అందుబాటులోకి రానున్న 1564 గదులు

ఐదేళ్లలో వీటిని పూర్తి చేస్తామంటున్న కంపెనీలు


విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్, పిచ్చుకలంకలో విఖ్యాత కంపెనీ ఓబెరాయ్‌ ఆధ్వర్యంలో రిసార్టులు

ఓబెరాయ్‌ విలాస్‌ బ్రాండ్‌తో రిసార్టులు

విశాఖపట్నం శిల్పారామంలో హయత్‌ ఆధ్వర్యంలో స్టార్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్‌

తాజ్‌ వరుణ్‌ బీచ్‌ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీసు అపార్ట్‌మెంట్‌

విశాఖపట్నంలో టన్నెల్‌ ఆక్వేరియం

విశాఖలో స్కైటవర్‌ నిర్మాణం

విజయవాడలో హయత్‌ ప్యాలెస్‌ హెటల్‌ 


అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో ఆథ్యాత్మిక పర్యాటక కేంద్రం

ఎస్‌ఐపీబీ ముందుకు ప్రతిపాదనలు

ఆమోదం తెలిపిన ఎస్‌ఐపీబీ


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:*  

పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి : అధికారులకు సీఎం నిర్దేశం 

టూరిజం అంటే ఏపీ వైపే చూడాలి : 

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలి :

అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలి :

నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకొండి :

ఆధునిక వసతలు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్రం స్ధాయి పెరుగుతుంది :

పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెరుగుతారు :

ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయి :

తద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి పెరుగుతాయి :

విశాఖపట్నంలో లండన్‌ ఐ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలి : అధికారులకు సీఎం ఆదేశం 


ఈ సమీక్షా సమావేశానికి ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ కె ప్రవీణ్‌ కుమార్, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్‌కుమార్, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.