వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన గవర్నర్
విజయవాడ : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. దివంతగ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. వైఎస్ఆర్ తన జీవితాన్ని ప్రజల సంక్షేమానికి అంకితం చేశారని ప్రస్తుతించారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, 104 ఆరోగ్య సేవల నుంచి ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తి పొందాయని గవర్నర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.


Thank You