తిరుపతి 4 ఆగస్టు 2021


 

ఉద్యోగుల నగదు రహిత వైద్యం కోసం ప్రత్యేక నిధి


- ఉద్యోగ విరమణ రోజే అన్ని ప్రయోజనాలు అందించాలి


 సీనియర్ అధికారుల సమీక్ష లో ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

      టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

         టీటీడీ పరిపాలన భవనంలో బుధవారం సాయంత్రం ఆయన సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఉద్యోగి రిటైర్మెంట్ రోజే అతనికి రావాల్సిన అన్ని ప్రయోజనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశామని చెప్పారు. దీన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. బ్రహ్మోత్సవాల నాటికి తిరుమలలో ఉద్యాన 

వనాలన్నీ అభివృద్ధి చేసి భక్తులకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఘాట్ రోడ్లలో విరిగి పడిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుమలలో అవసరమైన చోట కాటేజీల రూఫ్ పై సోలార్ సిస్టం ఏర్పాటు చేసి యాత్రికులకు వేడి నీళ్లు అందించాలన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం గురించి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో జింగిల్స్, స్క్రోలింగ్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలిపిరి ఫుట్ పాత్ పైకప్పు నిర్మాణం పనులు, కాటేజీల అభివృద్ధి పనులపై ఈవో సమీక్షించారు. సప్తగిరి మాసపత్రిక ఎడిటోరియల్ బోర్డ్ ను ఇటీవల పునః నియమించామని, వీరు హిందూ ధర్మప్రచారానికి ఉపయోగపడే చక్కటి వ్యాసాలలో పాటు, విద్యార్థులకు ఉపయోగపడే ఆర్టికల్స్ ముద్రించేలా వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.

      శ్వేత లో ఉద్యోగుల శిక్షణ విధానాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఉత్తమ శిక్షణ లభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తిరుమలలో మ్యూజియం అభివృద్ధి పనుల సమీక్ష కోసం టాటా, మహేంద్ర సంస్థల అధికారులతో త్వరలో వర్చువల్ కాన్ఫరెన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

     95 శాతం ఉద్యోగులకు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందన్నారు. మలి విడతగా 45 ఏళ్ళ లోపు ఉపాధ్యాయులు, లెక్చరర్లకు వ్యాక్సిన్ వేయించడానికి చర్యలు తీసుకోవాలని విద్యా విభాగం డిప్యూటీ ఈవో ను ఆదేశించారు. ఉద్యోగి కుటుంబంలో గర్భిణి, ఐదేళ్ల లోపు వయసు కలిగిన పిల్లల తల్లులకు వ్యాక్సిన్ వేయించడానికి ఏర్పాట్లు చేయాలని ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల ఐడి, ఫ్యామిలి, పెన్షన్ కార్డులను తాజా ఫోటోలతో తయారు చేసే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. తిరుమలలో భక్తులకు వసతి కల్పించడం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ఎంఎస్ విధానం, ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన సెల్ గురించి ఈవో సమీక్షించారు. సంస్థ కు సంబంధించిన కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు విభాగాధిపతులు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం న్యాయ విభాగానికి అందించాలన్నారు.

     విశాఖపట్నంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ఠ,  మహా సంప్రోక్షణ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.

    అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి. జెఈవో శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ ఏ అండ్ సి ఏవో శ్రీ బాలాజి, సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, లా ఆఫీసర్ శ్రీ రెడ్డెప్ప రెడ్డి తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.