సింహాచలం : శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్న విశాఖ పోలీస్ కమిషనర్ (visit of police commissioner of Visakhapatnam to Simhachalam temple)
విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ సూర్యకళ, ఏఈఓ రాఘవకుమార్, రమణమూర్తి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వాదం, ప్రసాదాలు అందించారు. ఆలయంలోని శిల్ప కళ, దాన్ని కాపాడుతూ నేటి తరానికి అందిస్తున్న తీరును ... మనీష్ కుమార్ సిన్హాకు ఆలయ ఈఓ సూర్యకళ వివరించారు. స్థల పురాణాన్ని ఆయనకు వేద పండితులు, ఈఓ సూర్యకళ చెప్పారు. ఆలయ విశేషాలు, శిల్పకళ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉందని... మరోసారి వచ్చి పరిశీలిస్తానని పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా చెప్పారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన కొనియాడారు.
Thank You