జమ్మూకశ్మీర్‌లోని హంద్వారాలో ఈనెల 3న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత్ ఐదుగురు సైనికులను కోల్పోయింది. ఉగ్రవాదులతో జరిగిన ఈ పోరులో కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనుజ్ సూద్, నాయక్ రమేశ్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ సింగ్, పోలీస్ శాఖకు చెందిన సబ్ ఇన్స్‌పెక్టర్ షకీల్ ఖాజీ వీరమరణం పొందారు. బంధీలుగా ఉన్న సామాన్య ప్రజలను రక్షించే రక్షించే క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టి ఈ ఐదుగురు అమరులయ్యారు. ఈ వీర సైనికులకు టాలీవుడ్ హీరోలు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తున్నారు.
Thank You