హరియాణా రాజ్ భవన్ - చండీగఢ్
తేదీ 13 జనవరి, 2023
జి.హెచ్.ఎం.సి గుడిమల్కాపూర్ కార్పొరేటర్ శ్రీ దేవర కరుణాకర్ గారి మృతి పట్ల హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.
జి.హెచ్.ఎం.సి కార్పొరేటర్ గా బి.జె.పి నాయకులు వెనుకబడిన కుటుంబం నుండి వచ్చి జాతీయ భావాలతో పెరిగి, రాజకీయాల్లో ప్రవేశించి, కార్వాన్ నియోజకవర్గంలో చాలా చురుకైన పాత్ర నిర్వహించి, నాంపల్లి నియోజక వర్గంనుండి పోటీ చేసి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునిసిపల్ డివిజన్ ని మూడుసార్లు గెలిపించిన ప్రజా నాయకులని శ్రీ బండారు దత్తాత్రేయ గారు కొనియాడారు. పేద ప్రజల పట్ల అంకిత భావంతో నిస్వార్థమైన సేవ చేస్తూ, ప్రతిష్టాకరమైన దర్బార్ మైసమ్మ దేవాలయం తో బాటు అనేక దేవాలయాలు, క్రీడా మైదానాలు మరియు క్రీడలను ప్రోత్సహిస్తూ, ప్రత్యేకించి నిరుపేదలకు ఇండ్ల పట్టాలకోసం ఉద్యమాలు నిర్వహించి వారికి పట్టాలు ఇప్పించే ప్రయత్నం చేసిన మంచి వినమ్రత కలిగిన వెనుక బడిన తరగతుల అభ్యున్నతి కోసం శ్రీ దేవర కరుణాకర్ నిరంతరం కృషిచేశారని వారిసేవలను దత్తాత్రేయ గారు గుర్తుచేసుకున్నారు. కార్పొరేటర్ గా హైదరాబాద్ నగరంలోని సమస్యల గురించి, త్రాగు నీరు, మునిసిపల్ టాక్స్ మరియు అభివృద్ధి పనులకోసం బడ్జెట్ విషయాల్లో జి.హెచ్.ఎం.సి సర్వసభ్య సమావేశాల్లో కీలక పాత్ర నిర్వహించారని, కురుమ సంగం లో బాధ్యతలు చేపట్టి డెవలప్మెంట్ విషయంలో కీలక పాత్ర పోషించారని, శ్రీ దేవర కరుణాకర్ గారు తనకు ప్రియమైన మిత్రుడు, ఆత్మబంధువు అని, గొప్ప నాయకునిగా పేరుతెచ్చుకున్న శ్రీ దేవర కరుణాకర్ అని, వారి మృతి తో హైదరాబాద్ నగరం ఒక ఉత్తమమైన కార్పొరేటర్ ని కోల్పోయిందని, వారి మృతి తో జాతీయ భావాలు కలిగిన సంస్థలకు తీరని నష్టం అని శ్రీ దత్తాత్రేయ గారు పేర్కొన్నారు.
ఇటీవలే కుమార్తె మృతినుండి ఇంకా కోలుకొని శ్రీ దేవర కరుణాకర్ గారి సతీమణి మాజీ కార్పొరేటర్ శ్రీమతి దీప గారు నేడు శ్రీ దేవర కరుణాకర్ గారి మృతితో వారి బాధ తీర్చలేనటువంటిదని, వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేస్తూ శ్రీ దేవర కరుణాకర్ గారి ఆత్మకు శాంతినిచేకూర్చాలని, ఈ బాధాతప్త సమయాన వారి కుటుంబసభ్యులందరికి ఈ కష్టకాలంలో తట్టుకోవడానికి మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు శ్రీ బండారు దత్తాత్రేయ గారు తెలియజేసారు.


Thank You