విశాఖపట్నం
10 నవంబరు 2022
కార్తీక దీపోత్సవానికి రండి
- విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతికి టీటీడీ జెఈవో ఆహ్వానం
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో నవంబరు 14వ తేదీ టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక మహాదీపోత్సవానికి హాజరు కావాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతిని ఆహ్వానించారు.
గురువారం ఆమె శారదా పీఠానికి వెళ్ళి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్తీక మహాదీపోత్సవానికి హాజరుకావాలని టీటీడీ తరపున ఆహ్వానించారు.
అనంతరం జెఈవో రుషికొండలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు. స్వామివారి దర్శనం తరువాత అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు.
-------------------------------------------- టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది


Thank You