*రాజ్ భవన్ - విజయవాడ*
సంతాప సందేశం
*రాహుల్ బజాజ్ మృతి పట్ల గవర్నర్ సంతాపం*
విజయవాడ, ఫిబ్రవరి 12: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మభూషణ్ శ్రీ రాహుల్ బజాజ్ శనివారం పూణెలో మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ జమ్నాలాల్ బజాజ్ మనవడు శ్రీ రాహుల్ బజాజ్ దేశంలో ఆటోమొబైల్ రంగం ఉన్నతికి దోహద పడ్డారని వివరించారు. బజాజ్ స్కూటర్ ను ఆవిష్కరించి దేశంలోని ప్రతి ఇంటికి దానిని చేరువ చేశారన్నారు.
మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ హరి చందన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

Thank You