ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమించినందులకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలియచేసిన నలమారు చంద్ర శేఖర్ రెడ్డి
అమరావతి: తేది: 10-11-2021 ఎ.పి.యన్.జి.ఒ.స్ సంఘ మాజీ అధ్యక్ష్యులు మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాద్యాయ, పెన్షనర్ల మరియు కార్మిక సంఘాల జే.ఏ.సి చైర్మన్ అయిన నలమారు చంద్ర శేఖర్ రెడ్డి గారిని రెండు సంవత్సరాల పదవీ కాలంతో ప్రభుత్వ సలహాదారుగా (ఉద్యోగుల సంక్షేమం) నియమించినందులకు ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి వారికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలియచేశారు. దానికి ముఖ్యమంత్రి గారు ప్రతిస్పందిస్తూ ఉద్యోగుల సంక్షేమం కోసం చంద్రశేఖర్ రెడ్డి పాటుపడాలని ఉద్యోగస్తులకి మెరుగైన సేవలు అందించడంలో ఆయన ప్రభుత్వానికి చక్కటి సలహాలు ఇవ్వవలిసిందిగా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. దానికి చంద్ర శేఖర్ రెడ్డి గారు స్పందిస్తూ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఉద్యోగస్తులు అందరికి మరియు ప్రభుత్వ పెన్షనర్లకి మెరుగైన సేవలు అందించడానికి ఆయన సాయశక్తులా కృషి చేసి ఇటు ప్రభుత్వానికి అటు ఉద్యోగులకి వారధిగా ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని తెలియచేసారు.
Thank You