అక్టోబరు 18, 2021
అమరావతి
*మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు*
మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వమానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు. భక్తి, శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
Thank You