"నీట్" పరీక్ష కేంద్రాన్ని రాజమహేంద్రవరం లో ఏర్పాటు చేయాలి
_కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయకు ఎంపీ మార్గాని భరత్ రామ్ వినతి
రాజమహేంద్రవరం, జూలై 29
గోదావరి జిల్లాలోని నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు అనువుగా గోదావరి జిల్లాల కేంద్రంగా రాజమహేంద్రవరంలో నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయకు
రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్విప్ మార్గాన్ని భరత్ సమర్పించారు.
ఈ మేరకు కేంద్ర మంత్రిని ఎంపీ భరత్ రామ్ ఢిల్లీలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
దాదాపుగా ఈ ప్రాంతం నుంచి 13 వేల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు సిద్ధం అవుతున్నారని మూడవ దశ కోవిడ్ నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఈ పరీక్షా కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం నీట్ పరీక్ష కోసం సుమారు 250 నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణించి విశాఖపట్నం గాని అటు విజయవాడ గాని వెళ్లి నీట్ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఉందని వివరించారు.
గోదావరి జిల్లాల నుంచి ఉన్నతమైన ఫలితాలు సాధిస్తున్న విద్యార్థుల కోసం ఈ పరీక్షా కేంద్రాన్ని రాజమహేంద్రవరం లో ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఈ సదుపాయాన్ని కల్పించాల్సిందిగా కోరారు.
ఉభయ రాష్ట్రాల్లో విద్యాపరంగా ఈ ప్రాంతం కేంద్రంగా కూడా ఉందని వివరించారు. ప్రస్తుతం 13 కేంద్రాల్లో మాత్రమే నీటి పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Thank You