No title


 ప్రతి ఇంటికి పెద్దకొడుకులా గూడు నిలబెడుతున్న జగనన్న.


రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.


రామక్రిష్ణాపురం లే అవుట్ ను రెండవ రోజు సందర్శించిన మంత్రి.


ఇళ్ళ నిర్మాణాలకు అధికారులు సహకరించాలి.


ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన పరచాలి.


సుందర వాతావరణంలో అందమైన కోలని జగనన్న కాలని.


కొత్త గ్రామాల రూపకల్పన జగనన్న లక్ష్యం.


చంద్రబాబు నీ ఆటలు సాగవు.

పేద వారికి నూతన గృహప్రవేశం చేయించి తీరుతాం.


పలాస : జులై 05:


రాష్ట్రంలో పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి పెద్దకొడుకు అయ్యారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు ప్రభుత్వం అందించిన జగనన్న ఇళ్ళ స్థలం రామక్రిష్ణాపురం లే అవుట్ ను సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ పునాదులు నిర్మిస్తున్న లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ళ నిర్మాణంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలంటే ముందుగా వారికి సురక్షితమైన గూడు ఒకటి ఉండాలని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద వారికి పక్క ఇళ్ళు నిర్మించాలని అదికూడా సొంత పట్టా హక్కుని కలిగి ఉండాలని ఆలోచించిన జగనన్న ప్రతి ఆడపడుచు పేరునా ఇళ్లు పట్డా ఇచ్చారని తెలిపారు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో ప్రతి మహిళ జగన్మోహన్ రెడ్డిని పెద్దన్న గా పిలుస్తున్నారని అన్నారు. జగనన్న నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు పెద్ద గ్రామాలని నిర్మిస్తున్నారణని రాష్ట్రంలో 34 లక్షల పైబడి ఏకదాటిగా ఇళ్లు నిర్మాణం చేపట్టడం గతంలో ఎన్నడూ జరగలేదని అన్నారు. అందుకే తెలుగుదేశం నాయకుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి కన్నుకుట్టినట్టు అయ్యిందని తెలిపారు. కుట్ర బుద్ది కల్గిన చంద్రబాబు కోర్టులకి వెల్లాడని అందుకే ఎప్పుడో నిర్మాణం జరగాల్సిన ఇళ్లు లేటయ్యాయని చెప్పారు. వాస్తవానికి పేదలకు మేలు జరిగే ఇళ్ళపై కూడా చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు రాజకీయాలు చేయడం చూస్తే ఇంతకంటే నీచబుద్ది ఎక్కడైనా ఉందా అని అన్నారు. పేద ప్రజలకు గూడు, కూడు, గుడ్డ కల్పించే విదంగా ప్రభుత్వం పని చేస్తుంటే మాయదారి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని తెలిపారు. మోసాలు, కుట్రలు,కుతంత్రాలతో పబ్బం గడుపుతున్న చంద్రబాబు ఆటలు సాగనీయకుండా ఒక మహా సంకల్పంతో ఈ రోజు రాష్ట్రంలో ‌34 లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టడం అది ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాద్యం అని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రభుత్వం భూములు కొని అక్క చెల్లమ్మల పేరు మీద పట్టాలు ఇచ్చి వారికి శాశ్వత హక్కు కల్పించిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పారు. ఇంతటి మంచి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి జగనన్నకు శాశ్వతంగా ముఖ్యమంత్రి గా చూసుకుంటే రాష్ట్రంలో పేద ప్రజల భవిష్యత్తు మార్చేందుకు అవకాశం ఉంటుంది. రాబోవు రోజుల్లో కోసంగిపురం కూడలి వద్ద ఉన్న రామక్రిష్ణాపురం లే అవుట్ లో 2 వేల 4 వందల ఇల్లు నిర్మించినప్పు ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. సుందరమైన ఒక పెద్ద గ్రామంగా రామక్రిష్ణాపురం లే అవుట్ తయారవ్వబోతుందని తెలిపారు. ప్రతి ఇంటికి మంచినీరు, వెడల్పు అయిన రోడ్లు, అండర్ డ్రైనేజి వ్యవస్థ, ప్రతి వీది సుందరంగా కనిపించేలా అత్యంత అద్భుతమైన నగరంగా తయారవుతుందని అన్నారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఆరోగ్యం అందించేందుకు ఒక అర్బన్ ఆసుపత్రి , పాఠశాల, ఆటస్థలం ఇలా అన్ని మౌళిక సదుపాయాలతో పూర్తి స్థాయి వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు త్వరితగతిన వారి ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టేలా చూడాలని అధికారులకు అదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల వద్దకు తీసుకు వెల్లి వారికి పూర్తి అవగాహన కల్పించి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ప్రయత్నం చేయాలని అన్నారు. లబ్ధిదారులు ఏవిషయంలో కూడా ఆందోళన చెంద వద్దని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన దిశా నిర్ధేశాలను పాటిస్తూ అందమైన ఇంటిని నిర్మించుకు మీరు మీకుటుంబం క్షేమంగా సంతోషంగా నూతన గృహప్రవేశం చేసేవరకు ప్రభుత్వం మీ వెంట ఉంటుందని తెలిపారు. మన రాష్ట్రం,మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మీ ఆశిస్సులు ఉండాలని కొరారు. ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా మంత్రి కార్యాలయం దృష్టి తీసుకు వస్తే మీ సమస్యను తీర్చేందుకు సహకరిస్తామని తెలిపారు. మోసకారి చంద్రబాబు నీ ఆటలు సాగవు ప్రతి పేద వాడికి నూతన గృహప్రవేశం చేయించి తీరుతాం అంటూ ఘాటుగా హెచ్చరించారు. ప్రతి ఇంటిని ఒక యూనిట్ గా తీసుకుని వారి వసరాలు తీర్చడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ బోర క్రిష్ణారావు, ఏఎంసి చైర్మన్ పివి సతీష్, కోత పూర్ణచంద్రరావు పలాస కాశీబుగ్గ మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, లబ్ధిదారులు , ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.