ఏపీ శాసనమండలి రద్దు అంశం పరిశీలనలో ఉంది

 


ఏపీ శాసనమండలి రద్దు అంశం పరిశీలనలో ఉంది: కిరణ్‌ రిజిజు*

*న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు అంశాన్ని తెదేపా ఎంపీ కనకమేడల రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మండలి రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు. మండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని వివరించారు. శాసనమండలి రద్దుపై తీర్మానం చేసిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.