పత్రికా ప్రకటన తిరుపతి, 2021 జులై 08
బర్డ్ ఆసుపత్రిలో స్వచ్ఛంద విజిటింగ్ కన్సల్టెంట్ల సేవలకు ఆహ్వానం
టిటిడి బర్డ్ ట్రస్టు ఆసుపత్రిలో స్వచ్ఛందంగా విజిటింగ్ కన్సల్టెంట్లుగా సేవలందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్లు లేదా ఆర్థోపెడిక్ డాక్టర్లను టిటిడి ఆహ్వానిస్తోంది. నెలకు ఒకసారి వీరు ఆసుపత్రికి వచ్చి రోగులకు వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది.
ఈ సేవలకు ముందుకొచ్చే సర్జన్లకు / డాక్టర్లకు టిటిడి పలు ప్రయోజనాలు కల్పిస్తుంది. వీరు వైద్యసేవలందించేందుకు ఆసుపత్రికి వచ్చినపుడు తిరుమల మరియు తిరుపతిలో వసతి కోసం గది కేటాయిస్తారు. సదరు డాక్టర్‌తోపాటు భార్య, పిల్లలకు ఉచితంగా విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. తిరుపతి నుండి తిరుమలకు ఉచితంగా రవాణా వసతి కల్పిస్తారు.
ఆసక్తి గల సర్జన్లు / డాక్టర్లు తమ అంగీకారాన్ని, దరఖాస్తులను మెయిల్ ద్వారా గానీ లేదా పోస్టు ద్వారాగానీ పంపవచ్చు. మెయిల్ ఐడిలు : eottdtpt@gmail.com, addleottd@tirumala.org, officebirrd@gmail.com. చిరునామా : డైరెక్టర్, బర్డ్ ట్రస్టు ఆసుపత్రి, స్విమ్స్ కాంపౌండ్, తిరుపతి - 517501.
---------------------------------------------------------------------
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Thank You