No title

 గ్రామ పాలనలో విప్లవాత్మక మార్పులు: మంత్రి పెద్దిరెడ్డి

గ్రామ సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌

*అమరావతి*

గ్రామీణ పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో పల్లె ముంగిట్లోకే పాలన వచ్చిందన్నారు. గ్రామ సర్పంచ్‌లతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జూలై 8న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని ఆయన తెలిపారు. ఆరోగ్యకరమైన గ్రామాలే లక్ష్యంగా స్వచ్ఛసంకల్పానికి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. ‘‘గ్రామ సర్పంచ్‌ల భాగస్వామ్యంతోనే పల్లెల రూపురేఖలు మారుతాయి. ప్రజాప్రతినిధులుగా మీ ఎదుగుదలకు సర్పంచ్‌ పదవి తొలిమెట్టు. ప్రతిగ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలి. స్వచ్ఛసంకల్ప కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని’’ మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.