శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..


గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మే ఒకటో తేదీ శుభవార్త. వంట గ్యాస్ ఉపయోగిస్తున్న వారికి భారీ ఊరట లభించింది. తాజాగా గ్యాస్ సిలిండర్ ధర భారీగా దిగొచ్చింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.214 తగ్గింది. అదేసమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (19 కేజీలు) ధర రూ.336 క్షీణించింది. కొత్త రేట్లు మే1 నుంచి అమలులోకి వస్తాయి.
తాజా ధరల తగ్గింపు నేపథ్యంలో ఎల్‌పీజీ సిలిండర్ (14 కేజీలు) రూ.583 నుంచి ప్రారంభమౌతోంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.988 నుంచి ఆరంభమౌతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు భారీగా దిగిరావడంతో గ్యాస్ సిలిండర్ ధర కూడా దిగొచ్చింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. మార్చి 15 నుంచి వీటిల్లో ఎలాంటి మార్పు లేదు స్థిరంగానే ఉంటూ వస్తున్నాయి.నగరాల వారీగా గ్యాస్ సిలిండర్ ధరను గమనిస్తే.. ఢిల్లీలో ధర రూ.744 నుంచి రూ.611కు దిగొచ్చింది. కోల్‌కతాలో గ్యాస్ సిలిండర్ ధర రూ.839 నుంచి రూ.774కు తగ్గింది. ముంబైలో సిలిండర్ ధర రూ.579గా ఉంది. గత నెలలో ధర రూ.714గా ఉంది. చెన్నైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.761 నుంచి రూ.569కు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.862 నుంచి రూ.796కు తగ్గింది.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.