కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత భారీగా ఉద్యోగాల్లో కోత



కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) స్పష్టం చేసింది. గతవారం 200 మందికిపైగా సీఈఓలతో ఆ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లాక్‌డౌన్‌ కాలం పూర్తయిన తర్వాత అనేక రంగాల్లో ఉద్యోగుల కుదింపులు ఉంటాయని 52 శాతం మంది సీఈఓలు వెల్లడించారని సీఐఐ పేర్కొంది. ‘కొవిడ్‌ 19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలపై ప్రభావం - సీఈఓల స్నాప్‌ పోల్‌’ పేరిట సీఐఐ గతవారం ఈ సర్వే నిర్వహించింది. ఆదివారం ఈ నివేదికను ప్రకటించడంతో ఉత్పాదక రంగాల్లోని ఉద్యోగులు కలవరపాటుకు గురవుతున్నారు.

⍟ దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై సమీక్షించిన తర్వాతే విద్యా సంస్థల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతే ప్రభుత్వానికి అతి ముఖ్యమైన అంశమని ఆయన స్పష్టంచేశారు. ఏప్రిల్‌ 14 తర్వాత కూడా పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చినా.. విద్యా సంవత్సరం కోల్పోకుండా చూసేందుకు మానవ వనరుల మంత్రిత్వశాఖ సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు.

 మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి ఇచ్చిన విందుకు హాజరైన 10 మందికి కరోనా సోకడంతో అందులో పాల్గొన్నవారు, వారితో సన్నిహితంగా మెలిగిన 26 వేల మందిని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచడం కలకలం రేగింది. మోరేనాకు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో వెయింటర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అతడి తల్లి చనిపోవడంతో దుబాయ్ నుంచి మార్చి 17న మోరేనా నగరానికి వచ్చాడు. ఆమె మృతికి సంతాపంగా మార్చి 20న విందు ఏర్పాటుచేసి బంధు మిత్రులను పిలిచాడు. పూర్తి కథనం..

 ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం 205 దేశాలకు వ్యాప్తిచెందిన ఈ మహమ్మారి ఇప్పటికే వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. కొన్ని లక్షల మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక అన్ని దేశాలూ సతమతవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పూర్తి కథనం..

 దేశంలో కరోనా వైరస్ మహ్మమారి మరింత తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరణాలు అంతేస్థాయిలో ఉన్నాయి. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన లాక్‌డౌన్ కొనసాగుతుండగా.. కరోనాపై పోరుకు ఆదివారం రాత్రి (ఏప్రిల్ 5) 9 గంటలకు విద్యుత్ దీపాలను ఆపి.. ఇంటి ముందు కొవ్వొత్తులు, దివ్వెలు వెలిగించిన సంకల్పం చేసుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపును దేశయావత్తూ ఆచరించింది. పూర్తి కథనం..



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.